కురుపాం: పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్‌షాపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మెయిన్‌రోడ్డులోని ఓ హోటల్‌లో అనధికారికంగా నిల్వ ఉంచిన 8 ఫుల్ గ్యాస్ సిలిండర్లు, ఓ స్వీట్ స్టాల్‌లో 4 గ్యాస్ సిలిండర్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విజిలెన్స్ ఎస్సై రామారావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కురుపాం సివిల్ సప్లైస్ డీటీ రమణారావు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ.. హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, తదితర వాణిజ్య సంస్థల నిర్వాహకులు తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాలని సూచించారు. గృహ అవసరాలకు రూపొందించిన సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.


