బొబ్బిలి: కొద్ది రోజులుగా బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతుండగానే పంచదార, ఉల్లి పాయల ధరలు అమాంతం పెరిగాయి. నిత్యావసరాల్లో ఒకటైన పంచదార ధర కిలో రూ.70కి పెరిగి చేదుగా మారింది. ఒకేసారి కిలో వద్ద రూ.25 నుంచి రూ.30వరకు ధర పెరిగింది. ఉదయం లేవగానే టీ, కాఫీలకు, చిన్నారులకు పాలు అందించాలన్నా పంచదార తప్పనిసరి. వస్తున్నవి పండగ రోజులు కావడంతో మిఠాయిలు, పిండివంటలకు ఇబ్బందులు తప్పేలా లేవని వినియోగదారులు గగ్గోలుపెడుతున్నారు. తమ నిత్యావసరాల ధరల జాబితా నుంచి పంచదారను పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తోంది.
ఉల్లిపాయల ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతూ వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం కిలో రూ.50 పలుకుతోంది. ధరల నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటు హోల్‌సేల్ ఇటు రిటైల్ ధరలు పెరిగిపోతుండడంతో వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.
గగ్గోలుపెడుతున్న
వినియోగదారులు
ధరల నియంత్రణను పూర్తిగా గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం


