న్యూస్‌రీల్
ఆదివారం కూడా సెలవు లేదట..
ఆదేశాలు వచ్చాయి..
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఆకాశం కొంచెం మబ్బు పట్టిందంటే చాలు.. వాన పడుతుందని సంబరపడాలో, లేక ఎప్పుడు ఏ పిడుగు మీద పడుతుందోనని భయపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. –8లో
విజయనగరం ఫోర్ట్:
ఉపాధి హామీ పథకంపై చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల వేతనదారులు ఇదేం కర్మరా.. ‘బాబు’ అంటూ నిట్టూర్చుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిబంధనలు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చి రెండు దశాబ్ధాలు దాటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ సర్కార్ వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు
జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6,26,094 మంది వేతనదారులు ఉన్నారు. వీరిలో 5,17,126 మంది పనికి వెళ్లేవారు ఉన్నారు. జిల్లాలో 775 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.
సర్కార్ వింత పోకడ
టీడీపీ సర్కార్ వింత పోకడపై వేతనదారులు విస్తుపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆది వారం పూట పనులు పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఎండలు మండుతున్నాయి. ఎండలో పని చేయ డం వల్ల డీహైడ్రేషన్‌కు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. వారంలో ఆరు రోజుల పాటు పని చేసి ఒక్క రోజు సెలవు ఉంటే వేతనదారులకు కాస్త విశ్రాంతి దొరికేది. కానీ ఇప్పడు వారం రోజులు పని చేయా ల్సి రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వా రంలో ఒక్క రోజు కూడా విశ్రాంతి దొరికే పరిస్థితి లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుట్టుగా..
ఉపాధి హామీ అధికారులు ఆదివారం పనులు పెడుతున్న విషయం ఇంతవరకు బయటకు పొక్కనీయలేదు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఆదివారం, పండగ పూట కూడా పనులు పెట్టుకోమని ఆదేశాలు వచ్చాయని ఉపాధి హామీ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారులు బయటకు చెప్పకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సెలవు లేకుండా నిరంతరం ఎండలో పని చేయడం కష్టతరంగా ఉందని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల పాటు సెలవు లేకుండా పని చేయడం ఇష్టం లేక చాలా మంది పనులకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే వేతనదారులకు ఆదివారం కూడా సెలవు లేదట. ఈ పథకం అమల్లోకి వచ్చి 25 ఏళ్లు అవు తుంది. అప్పటి ఉపాధి వేతనదారులు వారంలో ఆరు రోజులు (సోమవారం నుంచి శనివారం) వరకు పనికి వెళ్లేవారు. ఆదివారం వేతనదారులకు సెలవు ఉండేది. దీంతో వారంలో ఒక్క రోజు విశ్రాంతి దొరికేది. ఇప్పుడు ఆదివా రం కూడా పనులకు రమ్మని కొత్తగా నిబంధన తేవడంతో వేతనదారులు మండిపడుతున్నారు.
ఆదివారం పూట పనులు పెట్టుకోవచ్చునని ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకే పనులు పెడుతున్నాం. పనికి ఆదివా రం రావడం,రాకపోవడం వేతనదారుల ఇష్టం.
– ఎస్.శారదదేవి, పీడీ, డీఎంహెచ్‌ఓ


