ఈ నెల 15 నుంచి అమలు రెండు నెలల పాటు వేటకు విరామం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
జిల్లాలో నాలుగు వేల మంది మత్స్యకారులు
వేట చేసి ఒడ్డుకు వస్తున్న బోటు
పూసపాటిరేగ :
సముద్రంలో చేపల వేటను ఈ నెల 15 నుంచి నిషేధిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన ట్టు మత్స్యశాఖ డెప్యూటీ డైరెక్టర్ విజయకృష్ణ ఆదివారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు తెలిపారు. జూన్ 14 నుంచి సముద్రంలో వేటను పునరుద్ధరిస్తారని తెలిపా రు. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలలో సముద్రంలో చేపలు, రొయ్యలు, తాబేళ్లు వంటి మత్స్య జాతులు గుడ్లు పెట్టి పొదిగే సమయంగా ఈ కాలం భావిస్తా రు. సముద్రంలో చేపల వేట సాగిస్తే మత్స్య సంప ద నాశనం అవుతోందని ప్రభుత్వమే ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో వేట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు.
జిల్లాలో 885 బోట్లు
జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 21 మత్స్యకార గ్రామాలలో 885 బోట్లులో వేట సాగిస్తున్నట్టు అధికారంగా రికార్డులు వున్నాయి. చింతపల్లిలో 412 బోట్లు, తిప్పలవలసలో 226 బో ట్లు, పతివాడబర్రిపేటలో 163, కోనాడలో నాలు గు, తమ్మయ్యపాలెంలో 25, పులిగెడ్డలో 10, ము క్కాంలో 91, చోడిపల్లిపేట 38, కొండ్రాజుపాలెం 60, చేపలుకంచేరులో 91 బోట్లు వున్నాయి. ఇంజ ను బోటుకు ఐదుగురు, సాంప్రదాయ బోటుకు ముగ్గురు చొప్పున సాయం అందచేయడానికి ఉత్తర్వులు ఇచ్చారు. 18 నుంచి 60 ఏళ్లలోపు వున్న మత్స్యకారులు మాత్రమే మత్స్యకార భరోసాకు అర్హులు అని ప్రకటించారు. వేట నిషేధాన్ని ఉల్లంఘించిన మత్స్యకారులకు పరిహారం నిలిపి వేస్తామని. ప్రతి మత్స్యకారుడుకి ఈకేవైసీ తప్పనిసరిగా వుండాలని, భరోసా సాయంకు విధివిధానాలు ఖరారు చేశారు. అయితే ప్రభుత్వం వేట నిషేధ భృతి ఇచ్చినప్పటికి చాలా మంది మత్స్యకారులకు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలతో అనర్హులుగా ప్రకటించి వేట నిషేధభృతిని నిలిపివేస్తున్నారు.


