విజయనగరం అర్బన్: జిల్లా ప్రజల సమస్యల ను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవా రం కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్య ల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. అర్జీదారులు దరఖాస్తుల్లో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరా లను స్పష్టంగా నమోదు చేయాలని, సమస్య కు సంబంధించిన ఆధారాలను జతపరచాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత అర్జీ రశీదును తప్పనిసరిగా తీసుకురావా లని తెలిపారు. అర్జీల స్థితిగతులను తెలుసుకు నేందుకు ప్రభుత్వం ఎస్‌ఎంఎస్ సౌకర్యాన్ని కల్పించిందని, సమస్య పరిష్కారం అనంతరం నోటీసులు లేదా ఎండార్స్‌మెంట్లు వాట్సాప్, రిజస్టర్ పోస్టు ద్వారా పంపుతారని వివరించా రు. కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమీపంలోని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు.
రేగిడి/సీతంపేట: రేగిడి మండలానికి చెందిన 108 వాహనంలో పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం తురైమానుగూడకు చెందిన గిరిజన మహిళ ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట మండలం తురైమానుగూడకు చెందిన బిడ్డిక యమున పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. సీతంపేటతో పాటు పరిసర 108 వాహనాలు వేరే కేసుల్లో ఉండడంతో రేగిడి మండలం 108 వాహనానికి సమాచారం వచ్చింది. వెంటనే ఇక్కడి పైలెట్ గర్భాపు నారాయణరావు వాహనాన్ని తురైమానుగూడకు తీసుకువెళ్లగా అక్కడ యమున బంధువులు ఆమెను ఆ వాహనంలో పాలకొండ తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే యమునకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో వాహనంలో ఈఎంటీ మీసాల ఈశ్వరరావు ప్రాథమిక చికిత్సను అందించడంతో వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వారిని పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.
బొబ్బిలి: అమెరికా తన సామ్రాజ్యవాదాన్ని ప్రపంచానికి మరోసారి ప్రకటించుకునేందుకే ఇరాన్‌పై యుద్ధం చేస్తోందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి.రాంభూపాల్ అన్నారు. గురజాడ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో అమెరికా సామ్రాజ్యవాద యుద్ధం – అంతర్జాతీయ పరిణామాలు – భారత్‌పై ప్రభావం అనే అంశంపై ఆదివారం సెమినార్ జరిగింది. యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు కె.విజయగౌరి అధ్యక్షతన జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్యవక్తగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సామ్రాజ్యవాదం కోసం ఇరాన్, వెనిజుల, క్యూబా, తదితర దేశాలపై అమెరికా యుద్ధం పేరుతో దాడులు చేస్తోందన్నారు. ఇరాన్‌లోని పాఠశాలపై చేసిన దాడుల్లో పాఠశాలపై బాంబులేసి ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని పొట్టన పెట్టుకుంటే మోదీ ప్రభుత్వం కనీసం ఖండించకపోవడం దారుణమన్నారు. మోదీ ఒంటెత్తు పోకడలతో దేశానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. భూమార్గంలో పైపుల ద్వారా గ్యాస్ పంపుతామంటే మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెనిజులా అధ్యక్షుడిని ఆయిల్ నిక్షేపాల కోసమే నిర్భంధించారని ఇటువంటి సామ్రాజ్యవాదాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కౌన్సిలర్ జేసీ రాజు, రిటైర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, జేఏసీ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.శివానంద్, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


