వైద్యురాలి అత్యాశ..! | - | Sakshi
Sakshi News home page

వైద్యురాలి అత్యాశ..!

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

వైద్యురాలి అత్యాశ..!

ఉద్యోగిగా జీతం, పీజీ విద్యార్థినిగా స్టైఫండ్‌ తీసుకున్నట్టు ఆరోపణలు నిబంధనల ప్రకారం పీజీకి వెళ్తే.. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయాలి రాజీనామా చేయకుండానే రూ.లక్షల్లో జీతం తీసుకున్నట్టు విమర్శలు

విచారణ చేస్తాం..

విజయనగరం ఫోర్ట్‌:

వైద్య విధాన్‌ పరిషత్‌ (ఏపీవీపీ)కి చెందిన ఓ వైద్యురాలు అత్యాశతో వ్యవహరించినట్టు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్నట్టు జీతం తీసుకోవడంతో పాటు పీజీ చదువుతున్నట్టు స్టైఫండ్‌ కూడా తీసుకుంటున్నట్టు వైద్య విధాన్‌ పరిష త్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రెండు చో ట్ల భారీగానే ఆమె లబ్ధి పొందినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వైద్య విధాన్‌ పరిషత్‌లోని ఓ ఆస్పత్రిలో కాంట్రాక్ట్‌ పద్ధతిపై పని చేసిన ఓ వైద్యురాలు కొద్ది నెలలు క్రితం సూపర్‌ స్పెషాలటీ విభాగంలో పీజీ రావడంతో వెళ్లిపోయారు. అయితే ఇక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడ చేరాల్సి ఉంది. కానీ సదరు వైద్యురాలు ఉద్యోగానికి రాజీనామా చేయకుండా మెటర్నటీ లీవు పెట్టి 6 నెలలకు సంబంధించి నెలకు రూ.2 లక్షలు చొప్పన జీతం తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవీవీపీ ఆస్పత్రిలో మెటర్నటీ లీవు పెట్టిన సమయంలోనే పీజీలో చేరి అక్కడ కూడా మెటర్నిటీ లీవు పెట్టి స్టైఫండ్‌ తీసుకున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిబంధన ప్రకారం పీజీ కోర్సులో చేరే ముందు ఇక్కడ ఉద్యోగానికి రాజీనా మా చేయాలి. పీజీలో చేరిన తర్వాత స్టైఫండ్‌ మాత్రమే తీసుకోవాలి. కానీ సదరు వైద్యురాలు స్టైఫండ్‌, జీతం రెండు తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏపీవీపీ అధికారుల తీరుపై అనుమానాలు

వైద్యురాలు జీతం, స్టైఫండ్‌ తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వైద్య విధాన్‌ పరిషత్‌ అధికారుల తీరుపైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల పాత్ర లేకుండా సదరు వైద్యురాలు రెండు చోట్ల ఏ విధంగా లబ్ధి పొందగలరనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారంలో ఓ ఉద్యోగి పెద్ద మొత్తంలో చేతి వాటం ప్రదర్శించిన ట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

పీజీ కోర్సులో జాయిన్‌ అయ్యేవారు ముందుగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అయితే రాజీనామా చేయాలి. రెగ్యులర్‌ ఉద్యోగులు అయితే రిలీవింగ్‌ ఆర్డర్స్‌ తీసుకోవాలి. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా పీజీలో చేరకూడదు. రెండు చోట్ల లబ్ధి పొందకూడదు. దీనిపై వైద్యురాలు పీజీ చదువుతున్న వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు లెటర్‌ రాసి విచారణ చేపడతాం.

– డాక్టర్‌ ఎన్‌.పద్మశ్రీ రాణి, డీసీహెచ్‌ఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement