కుష్ఠు రోగులపై కూటమి వివక్ష..! | - | Sakshi
Sakshi News home page

కుష్ఠు రోగులపై కూటమి వివక్ష..!

Apr 12 2026 2:48 AM | Updated on Apr 12 2026 2:48 AM

–8లో

–8లో

‘జలధార – జలహారతి’పై సమీక్ష

‘జలధార – జలహారతి’పై ఏపీఎస్‌ఏసీ జియోసైన్సెస్‌ విభాగాధిపతి ఎ.మరియరాజుతో కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి శనివారం

తన చాంబర్‌లో సమీక్షించారు.

అంగన్‌వాడీలకు చేరని పాలు

అంగన్‌వాడీ కేంద్రాలకు సకాలంలో పాలు సరఫరా కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

రాజాం:

కుష్ఠురోగులపై చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు వివక్ష చూపుతోంది. కుష్ఠు ఆస్పత్రులకు సౌకర్యాల కల్పనలో జాప్యం రోగులకు శాపంగా మారింది. విరిగిన మంచాలు, చాలీచాలని భోజనం, పెంకులూడి కారిపోతున్న భవనాలు, చుట్టూ ముళ్లపొదలతో అధ్వానంగా ఉన్న పరిసరాలు రోగులను భయపెడుతున్నాయి. దీనికి రాజాం మండలం పొగిరి గ్రామంలోని కుష్ఠువ్యాధి నిర్మూలన ఆస్పత్రే నిలువెత్తు నిదర్శనం. ఆస్పత్రిని 1962లో నిర్మించారు. ఇక్కడ రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి నియోజకవర్గాల్లోని రోగులతో పాటు అటు ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస నియోజకవర్గాలకు చెందిన రోగులు వైద్యసేవలు పొందుతున్నారు. ఒకప్పుడు ఆరేడు భవనాలతో రోగులకు విశేష సేవలందించిన ఆస్పత్రి ఇప్పుడు కునారిల్లుతోంది. భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. కిటికీల తలుపులు ఊడిపోయాయి. ఆస్పత్రికి రక్షణగోడలేదు. ఆస్పత్రి చుట్టూ ముళ్లపొదలు, పాముల పుట్టలు అధికమయ్యాయి. ఆస్పత్రికి వచ్చిన రోగులు రాత్రి సమయాల్లో ఉండలేక రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్‌, ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి, పార్కులు వద్ద నిద్రించి.. ఉదయాన్నే మళ్లీ ఇక్కడకు వస్తున్నారు. అప్పట్లో ఇద్దరు వైద్యులు, 12 మందికిపైగా సిబ్బంది ఉండే ఈ ఆస్పత్రిలో ఇప్పుడు కేవలం ఒక వైద్యుడు, ముగ్గురు సిబ్బంది మాత్రమే సేవలు అందిస్తున్నారు. వీరు కూడా కేవలం పగటి సమయంలో మాత్రమే ఉంటారు. రాత్రైతే ఇక్కడ ఆస్పత్రికి సంబంధించి ఒక్క ఉద్యోగి కూడా ఉండరు. అత్యవసర వైద్య సేవలు అందక రోగులు మృత్యువాత పడినా, ప్రమాదాలకు గురైనా దేవుడే వీరికి దిక్కు.

తిండీ తిప్పలు ఉండవు

పొగిరి లెప్రసీ ఆస్పత్రిలో ప్రతీనెల సగటున 20 నుంచి 22 కేసులు నమోదవుతాయి. 13 నుంచి 18 మంది రోగులు ఇన్‌పేషెంట్లుగా వైద్యసేవలు పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం ఎటువంటి భోజన సదుపాయాలు ఏర్పాటుచేయలేదు. కనీసం వంటగది లేదు. దాతలు భోజనాలు తెస్తే వీరికి పెద్ద పండగే. ఇక్కడ పరిస్థితి చూసి కొంతమంది దాతలు అప్పుడప్పుడు భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. ఉదయం సమయంలో రోగులంతా తలో రూపాయి పోగేసి గంజి అన్నాన్ని వండించుకుంటున్నారు. జీఎంఆర్‌వీఎఫ్‌ నుంచి సరుకులు రాకుంటే వీరికి పస్తులు తప్పడంలేదు.

నిలిచిపోయిన కిట్లు

గతంలో రోగులకు దుప్పట్లు, అన్నంప్లేట్లు వంటివి సరఫరా చేసేవారు. రోగులకు ప్రత్యేకమైన బూట్లు, చెప్పులు అందించేవారు. ప్రస్తుత ప్రభుత్వం సరఫరాను నిలిపివేసిందని రోగులు చెబుతున్నారు. మందులు కూడా అరకొరగా అందుతున్నాయి. మరోవైపు పింఛన్‌ కూడా కొందరికి అందడంలేదు. గతంలో దివ్యాంగ ఫించన్‌ వచ్చేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత పింఛన్‌ నిలిపివేశారంటూ రేగిడి మండలం అరసాడ గ్రామానికి చెందిన ఓ బాధితుడు వాపోయాడు.

ఉన్నతాధికారుల

దృష్టికి తీసుకెళ్లాం..

పొగిరి లెప్రసీ ఆస్పత్రి భవనాలు శిథిలావస్థకు చేరాయి. సిబ్బంది కొరత ఉంది. దాతల సాయంతో మౌలికవసతులు కల్పిస్తున్నాం. తలుపులు, కిటికీలు, కొత్త అదనపు భవనాలు, మరుగుదొడ్లు, స్నానం గదులు నిర్మించాలని ఏడాది కిందటే వైద్యశాఖ ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాం. ఇంతవరకూ ఎలాంటి నిధులు మంజూరు కాలేదు.

– జె.కృష్ణమోహన్‌, ఆస్పత్రి మెడికల్‌ ఆఫీసర్‌, పొగిరి లెప్రసీ ఆస్పత్రి

ఈ ఫొటోలోని మంచాలు చూడండి. ఇవి పాత ఇనుపసామాన్లు షాపుల్లో కనిపించే వస్తువుల్లా ఉన్నాయి కదా. ఇవి కూడా పొగిరి లెప్రసీ ఆస్పత్రిలో రోగుల కోసం ఉంచిన బెడ్‌లు. పూర్తిగా పాడైన, విరిగిన బెడ్‌లపైనే రోగులు వైద్యసేవలు పొందుతున్నారు. కొత్తమంచాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు రెండేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదు. రోగులకు బెడ్‌ల సమస్య తప్పడం లేదు.

ఆస్పత్రులకు కనీసవసతులు కల్పించని వైనం

శిథిలభవనాల్లో

బిక్కుబిక్కమంటున్న రోగులు

తిండీతిప్పలులేక అవస్థలు

రాత్రి రక్షణలేని గదులు

పైసా కూడా విదల్చని చంద్రబాబు ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement