విజయనగరం టౌన్: విజయనగరం చదురుగుడిలోని పైడితల్లి అమ్మవారిని ప్రముఖ సినీ నేపథ్యగాయని పి.సుశీల శనివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆమెకు వేదాశీస్సులు అందజేశారు. అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఏటా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ గురునారాయణ కళాపీఠం ప్రతినిధులు బి.ఎ.నారాయణ, జి.సన్యాసమ్మ, తదితరులు పాల్గొన్నారు.


