దయనీయం.. కుష్ఠు రోగుల పరిస్థితి | - | Sakshi
Sakshi News home page

దయనీయం.. కుష్ఠు రోగుల పరిస్థితి

Apr 12 2026 2:48 AM | Updated on Apr 12 2026 2:48 AM

టి.హెచ్‌ వార్డు దుస్థితి

విజయనగరం ఫోర్ట్‌: సమాజం మాపై చిన్నచూపు చూస్తోందని, పాలకులైనా కనికరించి సదుపాయాలు కల్పించాలంటూ కుష్ఠు రోగులు కోరుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆవరణలో ఉన్న టీహెచ్‌ వార్డు దయనీయ పరిస్థితిని చూడాలంటూ విన్నవిస్తున్నారు. భవనం శిథిలావస్థకు చేరిందని, మరుగుదొడ్లు లేవని, రాత్రి వేళ విషసర్పాల భయం వెంటాడుతోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వార్డులో ఆరు ఫ్యాన్లుకు రెండు ఫ్యాన్లు మాత్రమే తిరుగుతున్నా పట్టించుకునేవారే లేరని వాపోతున్నారు. ఇదే విషయంపై జిల్లా కుష్ఠునివారణ అధికారి కె.రాణి స్పందిస్తూ టీహెచ్‌ వార్డులో సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement