డబుల్ ఎంట్రీ ఓట్ల తొలగింపు
● స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీలా గాంధీ
గజపతినగరం: గజపతినగరం నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీ అయిన సుమారు 700 ఓట్లను తొలగించనున్నట్లు నియోజకవర్గ ఎన్నికల ఓటర్ల నమోదు అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీలా గాంధీ అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ వెంకటలక్ష్మి, రాజకీయ పార్టీల ప్రతినిధులు శీర వెంకటరమణ, జి.శ్రీనివాస్, పురం అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.


