ఉత్సాహంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు
చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడిలోని వేంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. 14వ విశ్వ విద్యాలయ క్రీడా సాంస్కతిక పోటీల్లో భాగంగా వివిధ కళాశాలల నుంచి హాజరైన విద్యార్థులు గురువారం ప్రదర్శించిన క్రీడా, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా డప్పు, మృదంగం, హార్మోనియం, పిల్లనిగ్రోవి వంటి వాయిద్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా క్లాసికల్ నృత్యాలు కూడా అలరించాయి. జావెలిన్ త్రో, లాంగ్‌జంప్ విభాగాలకు సంబంధించి బాలుర, బాలికల విభాగంలో తిరుపతి కళాశాల ముందంజలో నిలిచింది. 1500 మీటర్ల పరుగు పందెంలో బాలుర విభాగంలో గరివిడి వెటర్నరీ కళాశాల విజయం సాధించగా.. బాలికల విభాగంలో తిరుపతి కళాశాల విజేతగా నిలిచింది. బాలికల విభాగం వాలీబాల్ పోటీల్లో తిరుపతి కళాశాల విజయం సాధించగా, బాస్కెట్‌బాల్ పోటీల్లో గన్నవరం కళాశాల విజయాన్ని కై వసం చేసుకుంది. టేబుల్‌టెన్నిస్‌లో తిరుపతి కళాశాల విజేతగా నిలిచింది. కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా సాంస్కృతిక సమ్మేళనంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ హెడ్ బి.జయచంద్ర, ఆఫీసర్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ వైఆర్ అంబేడ్కర్ సహకారం అందించారు.
ఉత్సాహంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్సాహంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్సాహంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు


