పరిహారం ఇవ్వకుండాపనులా?
భోగాపురం:
మండలంలోని కంచేరు రెవెన్యూ పరిధిలోని బైరెడ్డిపాలెం గ్రామంలో జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం చేపట్టిన విమానాశ్రయ అప్రోచ్ రోడ్డు పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనిపై తహసీల్దార్ రమణమ్మ స్పందిస్తూ భూములకు సంబంధించిన నష్టపరిహారాన్ని అప్పటి అధికారులు కోర్టుకు అప్పగించారని, కోర్టు ను ఆశ్రయించి తీసుకోవాలన్నారు. కోర్టు అనుమతులతోనే విమానాశ్రయ అప్రోచ్ రోడ్డు చేపట్టినట్టు తెలిపారు. షెడ్లు, పశువుల శాలల తొలగింపునకు పండగ వరకు గడువు ఇవ్వాలని కోరినా ససేమిరా అనడంతో రైతులు ఆందోళన చేశారు. పోలీసుల సాయంతో జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పనులు కొనసాగించారు.


