● ‘సహకారం’ ఏది బాబూ?
● ఉపాధి చూపండయ్యా..
సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా పీఏసీఎస్ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిరసన తెలిపారు. డీసీసీబీ కార్యాలయాల వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2019 తరువాత విధుల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, జీఓ నంబర్ 36ను అమలు చేయాలని కోరారు. పూసపాటిరేగ డీసీసీబీ కార్యాలయం వద్ద చేపల్టిన నిరసన శిబిరంలో కుమిలి పీఏసీఎస్ ఈఈఓ వి.సత్యనారాయణ, భోగాపురం, డెంకాడ, పోలీపల్లి, పూసపాటిరేగ పీఏసీఎస్ ఉద్యోగులు ఈశ్వరరావు, ఎ.వి.సత్యనారాయణ, ఆర్.మహేశ్వరరావు, కె.శ్రీను, నరేష్ పాల్గొన్నారు. – పూసపాటిరేగ
చిత్రంలో రెండేళ్లుగా అధికారులకు అందజేస్తున్న అర్జీలను చూపిస్తూ ఆవేదన వ్యక్తంచేస్తున్న వ్యక్తిపేరు గుడివాడ రామారావు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని ఇదాంవలస గ్రామం. అదే గ్రామానికి తన తండ్రి తవిటయ్య తలయారీగా పనిచేసేవారు. తండ్రి చనిపోయిన తరువాత ఆ ఉద్యోగం కల్పించాలంటూ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. సుమారు రెండేళ్లుగా తిరుగుతున్నా ఉపాధి కల్పించడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టరేట్‌లో మళ్లీ అర్జీ అందజేసేందుకు సోమవారం వచ్చారు. తన గోడు వినిపిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం
రాజాం పట్టణ పరిధిలోని బుచ్చింపేట గ్రామానికి చెందిన సర్వేనంబర్ 70/2లో 70 సెంట్లు విస్తీర్ణంలో రుద్రభూమి ఉంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికార బలంతో ఈ భూమిని కబ్జాచేసేందుకు పూనుకున్నారు. గతంలో రుద్రభూమిగా పేర్కొన్న భూమిని వీఆర్వో సాయంతో 1బీగా మార్చేసి రియల్ ఎస్టేట్ వేసి ప్లాట్‌గా విక్రయించేందుకు చూస్తున్నారు. తక్షణమే రుద్రభూమిని కాపాడాలంటూ గ్రామస్తులందరూ కలిసి వార్డు సచివాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. రుద్రభూమి వద్ద కూడా కాసేపు ఆందోళన చేశారు. శ్మశానవాటికను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పెద్దలకు నచ్చజెప్పారు. శ్మశాన వాటిక ఆక్రమణ అడ్డుకుంటామని భరోసా
ఇవ్వడంతో ఆందోళన విరమించారు. – రాజాం
● ‘సహకారం’ ఏది బాబూ?
● ‘సహకారం’ ఏది బాబూ?
● ‘సహకారం’ ఏది బాబూ?


