అంతర్ కళాశాలల అథ్లెటిక్స్‌లో ‘సీతం’కు పతకాలు
విజయనగరం అర్బన్: జేఎన్‌టీయూ – గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అంతర్ కళాశాల అథ్లెటిక్స్ పోటీలలో గాజులరేగ పరిధిలోని సీతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి కాంస్య పతకాలు సాధించారు. కళాశాలలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం ఈసీఈ విభాగానికి చెందిన వి.శివ పురుషులు జావలిన్ త్రో ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుచుకోగా, ద్వితీయ సంవత్సరం ఈసీఈ విభాగానికి చెందిన బి.హరీష్ ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో శనివారం నిర్వహించిన క్రీడా అభినందన సభలో కళాశాల సంచాలకులు మజ్జి శశిభూషణరావు విజేతలు అభినందించారు. కార్యక్రమంలో ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టి.డి.వి.ఎ.నాయుడు, మెకానికల్ విభాగాధిపతి సి.హెచ్.వెంకటలక్ష్మి, ఇతర అధ్యాపకులు, సీఎస్‌ఓ సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు జె.మహేశ్వరరావు, టి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


