రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాజాం సిటీ: పట్టణ పరిధి పాలకొండ రోడ్డులోని జేజే ఇనోటెల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రేగిడి మండలం ఉణుకూరు గ్రామానికి చెందిన కంటు గణేష్ (36) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్విచక్రవాహనంపై రాజాం వచ్చిన గణేష్ పనులు ముగించుకుని స్వగ్రామమైన ఉణుకూరు వెళ్తున్నాడు. జేజే ఇనోటెల్ ఎదురుగా వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో బాధితుని తలకు తీవ్రగాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మృతుని బావ కొనిస రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
జామి: బైక్‌పై వస్తున్న సమయంలో చెట్టును ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అలమండ సంతకు చెందిన దమ్మేటి మణికంఠ (26) అనే యువకుడు బైక్‌పై కొత్తవలస నుంచి బైక్‌పై అలమండ సంతకు వస్తున్న సమయంలో శనివారం మధ్యాహ్నం అలమండ పెట్రోల్ బంకు సమీపంలో రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మణికంఠ తల్లి లోవమణి చిన్నతనంలోనే మృతి చెందింది.
సంతకవిటి: మండల కేంద్రానికి చెందిన భోగి కనకరాజు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. మండల కేంద్రం కోమటివీధికి చెందిన కనకరాజు కూలి డబ్బులు విషయమై తల్లితో గొడవపడి గడ్డి మందు తాగాడు. శుక్రవారం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందినట్టు తెలిపారు. ఆస్పత్రి వర్గాల సమాచారంతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


