మానవీయ విలువలు పెంపొందించేలా.. | - | Sakshi
Sakshi News home page

మానవీయ విలువలు పెంపొందించేలా..

Dec 28 2025 7:19 AM | Updated on Dec 28 2025 7:19 AM

మానవీ

మానవీయ విలువలు పెంపొందించేలా..

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

పార్వతీపురం రూరల్‌: మానవీయ విలువలు పెంపొందించేలా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యకలాపాలు సాగాలని కలెక్టర్‌ ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఐటీడీఏ క్వార్టర్స్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన రెడ్‌క్రాస్‌ కార్యలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సేవే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలన్నారు. రక్తదాన శిబిరాలు ముమ్మరంగా నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ వైశాలి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్‌ భాస్కరరావు, జిల్లా మెడికల్‌ ఆఫీసర్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె. సాయికృష్ణ చైతన్య, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ మంచుపల్లి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ బీఎన్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురం రూరల్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, పార్వతీపురం మన్యం జిల్లా మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నాలుగు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ మంచుపల్లి శ్రీరాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యాధికారి–1, స్టాఫ్‌నర్స్‌–1, ఫార్మసిస్ట్‌ కమ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌–1, డ్రైవర్‌–1 పోస్టులను మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్‌లతో కలిపి 2026 జనవరి ఐదో తేదీలోగా జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాల యంలో సమర్పించాలన్నారు. వైద్యాధికారి పో స్టుకు రూ.500 (ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు), మిగిలిన పోస్టులకు రూ.300 చొప్పున డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను జతచేయాలని తెలిపారు.

వంగర: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కింజంగి గ్రామానికి చెందిన చిప్పాడ సింహాచలం (65) ఈ నెల 26న గ్రామాల్లో పప్పు దినుసులు విక్రయించుకుని టీవీఎస్‌ వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నాడు. సరిగ్గా శ్రీహరిపురం పరిధి బందరు చెరువు సమీపంలోకి వచ్చే సరికి శ్రీహరిపురం నుంచి బాగెంపేట వైపు వస్తున్న గంటాన తరుణ్‌ ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సింహాచలానికి తీవ్ర గాయాలు కావడంతో, రాజాంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఏఎస్సై వి. ప్రసాద్‌ తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

పురుగు మందు తాగిన వ్యక్తి..

వంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన బలగ సత్యంనాయుడు (67) పురుగు మందు తాగి మృతి చెందాడు. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యంనాయుడుకు మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం మద్యం బాటిల్‌ కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మద్యం బాటిల్‌ అనుకుని పొరపాటున ఇంటిలో ఉన్న పురుగు మందు తాగేశాడు. వెంటనే అపస్మారకస్థితికి చేరుకున్న సత్యంనాయుడును కుటుంబ సభ్యులు రాజాం సీహెచ్‌సీకి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందాడు. మృతుడి భార్య తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ నీలం శ్రీనివాసరావు తెలిపారు.

మానవీయ విలువలు  పెంపొందించేలా..   1
1/2

మానవీయ విలువలు పెంపొందించేలా..

మానవీయ విలువలు  పెంపొందించేలా..   2
2/2

మానవీయ విలువలు పెంపొందించేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement