పశుగ్రాసం పెంచేందుకు దరఖాస్తుల ఆహ్వానం
● పశుసంవర్థక శాఖ జేడీ
డాక్టర్ మురళీకృష్ణ
గంట్యాడ: పాలఉత్పత్తి పెంపే లక్ష్యంగా ఉపాధిహామీ పథకం నిధులతో పశుగ్రాసాలు పెంచేందుకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.మురళీకృష్ణ తెలిపారు. గంట్యాడ ప్రాంతీయ పశు వైద్యశాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపెయ్యిల పథకం కింద జిల్లాలో 9 వేలకు 6వేలు వ్యాక్సిన్లు వేసినట్టు తెలిపారు. మార్చి నెలఖారులోగా లక్ష్యాన్ని పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. జనవరి నెలలో మెగా పశగర్భకోశ శిబిరం, లేగ దూడల ప్రదర్శన ప్రతి మండలంలో నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో 8 పశువుల హాస్టల్స్ నిర్మాణానికి కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించామన్నారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ ఏడీ డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు.


