8 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు
పూసపాటిరేగ:
మండలంలోని పూసపాటిరేగ గ్రామంలో అనుమతి లేకుండా మద్యం అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు భోగాపురం ఎకై ్సజ్ సీఐ రవికుమార్ గురువారం తెలియజేశారు. అనుమతిలేని షాపులో ఎనిమిది మద్యం సీసాలు ఉండడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనధికార మద్యం షాపు నిర్వహించినా, ప్రోత్సహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.అనధికార మద్యం షాపుల వద్ద మద్యం కొనుగోలు చేసిన వ్యక్తులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఎస్సై చంద్రమోహన్, సిబ్బంది సత్యనారాయణ, ప్రతాప్ తదితరులు ఉన్నారు.


