ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నగదు బ్యాగ్ మాయం
విజయనగరం క్రైమ్ : స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్‌గేట్ వద్ద బుధవారం నగదుతో కూడిన బ్యాగ్ మాయమైంది. వివరాల్లోకి వెళ్తే.. సాలూరు నుంచి చిన్నమ్మ, రేవతి పండగ షాపింగ్‌కని విజయనగరం ఆర్టీసీలో బస్సులో వచ్చారు. బస్సు దిగిన ఇద్దరూ కాంప్లెక్స్ నుంచి నడుచుకుంటూ ఆటో కోసమని ఇన్‌గేట్ వద్ద ఆటో ఎక్కే లోపే గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగ్‌ను కొట్టేశారు. బ్యాగ్‌లో ఇన్నర్ పాకెట్ జిప్ తీసేసి అందులోంచి రూ.10వేల నగదు తీసుకెళ్లిపోయారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్‌కు బాధితులు వెళ్లి ట్రాఫిక్ సీఐ సూరినాయుడుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన తయన సబ్ కంట్రోల్ రూమ్‌లో రికార్డు అయిన సీసీ పుటేజ్‌ను పరిశీలించారు. ఇద్దరు మహిళలు తోటి ప్రయాణికుల వలే ఫిర్యాదుదారులతో కలిసి మాట్లాడే సమయంలోనే హ్యాండ్ బ్యాగ్‌ను తడిమి నగదు ఉన్నట్టు గుర్తించి బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిపోయి ఉంటారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాధితులు చిన్నమ్మ, రేవతి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


