భూసేకరణకు తొలి ప్రాధాన్యం
● అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో
కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం అర్బన్: జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, తోటపల్లి, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టులు, జాతీయ రహదారి–516 (బీ), కుర్దారోడ్–విజయనగరం మూడో రైల్వే లైన్, విజయనగరం–సంబల్‌పూల్ మూడో రైల్వే లైన్, కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వే లైన్ వంటి కీలక ప్రాజెక్టుల భూసేకరణపై ఆరా తీశారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో ఇ.మురళీ, ఆర్డీఓ దాట్ల కీర్తి, సత్యవాణి, రామ్మోహన్, ఎస్‌డీసీలు కళావతి, ప్రమీలాగాంధీ, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, రైల్వే, తదితర శాఖల అధికారులు, ఎల్‌ఏ డీటీలు పాల్గొన్నారు.


