అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఏవీ?
భవ్య సంస్థ నిర్వహణ బాధ్యత చేపట్టి ఏడు నెలలైంది. ఇంతవరకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఏ ఉద్యోగికి ఇవ్వలేదు. పే స్లిప్పులు లేవు. సెలవుకూడా ఇవ్వడం లేదు. ఒక వేళ సెలవు ఇస్తే వేతనంలో కోత విధిస్తున్నారు. బఫర్ ఉద్యోగులను తగ్గించడం వల్ల సెలవులు లేక ఇబ్బంది పడుతున్నాం. అరబిందో సంస్థ ఇచ్చిన జీతం కంటే పెంచాల్సింది పోయి, జీతం తగ్గించి ఇస్తున్నారు. ఆ సంస్థతో వేగలేం.
– ఎ.రామరాజు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
సమస్యలు చెబితే బెదిరింపులా?
ఉద్యోగుల సమస్యలు అధికారులకు చెబితే ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని భవ్య సంస్థ ప్రతినిధులు బెదిరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అడిషనల్ సీఈఓకు వినతిపత్రం ఇచ్చారని రాష్ట్ర కార్యదర్శి రాంబాబును అకారణంగా సస్పెండ్ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఫార్మాసిస్టులు, స్టాఫ్‌నర్సుల చేయాల్సిన విధులు చేయిస్తున్నారు. ఐదేళ్లు పూర్తయిన డ్రైవర్లకు రూ.21 వేలు జీతం చెల్లించాలన్న నిబంధన అమలుచేయలేదు.
– డి.జగన్‌మోహన్, 104 ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఏవీ?


