మిస్టర్ ఇండియా పోటీలకు కోన రమణ
శృంగవరపుకోట: మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీలకు ఎస్.కోటకు చెందిన బాడీ బిల్డర్ కోన రమణ ఎంపికయ్యాడు. ఈ నెల 21న తగరపువలసలో జరిగిన మిస్టర్ ఆంధ్రా ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీల్లో మాస్టర్స్ విభాగంలో పాల్గొన్న కోన రమణ 5వ స్థానం సాధించాడు. నిర్వాహకులు రమణకు రూ.1000లు నగదు ప్రోత్సాహకంతో పాటు మెడల్, ప్రశంసాపత్రం అందజేశారు. జనవరిలో ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు రమణ చెప్పాడు.
డీజీపీ కమోడేషన్‌కు ఎంపికై న విజయనగరం పీసీ
విజయనగరం క్రైమ్: ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖ ఇవ్వనున్న డీజీపీ కమోడేషన్ డిస్క్ అవార్డులను సోమవారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో సిల్వర్ డిస్క్ విజయనగరం పోలీస్ శాఖ పరిధి రామభధ్రపురం పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వై.అప్పలనాయుడును వరించింది. డీజీపీ సిల్వర్ డిస్క్‌లు నలుగురు ఐపీఎస్‌లతో పాటు మొత్తం 343 మందికి లభించాయి. కానిస్టేబుల్స్‌లో ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి ఇద్దరికి ఈడిస్క్ అవార్డులు లభించాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శారద ఉన్నారు.


