11 నెలల్లో 77 కేసుల నమోదు
● కొద్ది రోజుల కిందట జామి మండలం భీమషింగి వద్ద ఆటోలో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా సివిల్ సప్‌లై అధికారులు పట్టుకున్నారు. బియ్యం ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు.
● ఈ ఏడాది జూన్ నెలలో బొండపల్లి మండలం కొండకిండాం, కిండాం ఆగ్రహారంలోని కోళ్ల ఫారం, మామిడి తోటల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సుమారు 480 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేసే నార సంచులతోనే నేరుగా తరలించేశారు. అక్కడి నిల్వలను చూసి అధికారులే ఆశ్చర్యపోయారు.
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రేషన్ డిపోల నుంచి నేరుగా తరలించి వ్యాపారులు సొమ్ముచేసుకంటున్నారు. దీనివెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు అందాల్సిన వేలాది టన్నుల బియ్యం తరలింపు నిత్యకృత్యంగా మారడం ఇప్పుడు అధికార వర్గాలను సైతం విస్మయపరుస్తోంది. కొందరు అధికారులకు ఈ వ్యవహారం తెలిసినా చూసీచూడనట్టు వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
● ఓ టీడీపీ నేత అండతోనే...
జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత అండతోనే బియ్యం వ్యాపారులు యథేచ్ఛగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు సమాచారం. పీడీఎస్ బియ్యం తరలిస్తున్న సమయంలో ఎక్కడైనా అధికారులు పట్టు కునే ప్రయత్నిం చేసినప్పుడు సదరు నేత అధికారులకు ఫోన్ చేసి... ‘వాళ్లు మా వాళ్లే.. బియ్యంతో పాటు వదిలేయండి’ అని ఫోన్ చేస్తున్నారని తెలిసింది. నేత అండదండలతో బియ్యం మాఫియా బరితెగిస్తోంది. కొంతమంది రేషన్ డీలర్ల సహకారంతో నేరుగా రేషన్ షాపుల నుంచే పీడీఎస్ బియ్యాన్ని తరలించేస్తున్నారు. అయినప్పటకీ వారిపై ఎటువంటి చర్యలు ఉండడం లేదు. గ్రామాల్లో చిరువ్యాపారులు నుంచి పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి కొంతమంది వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు.
జిల్లాలో 11 నెలల్లో పీడీఎస్ బియ్యం తరలింపుపై–6ఏ కేసులు 77 నమోదుచేశారు. వారి నుంచి 729.91 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇంతకు 30 రెట్లు పీడీఎస్ బియ్యం తరలిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తనిఖీలకు ఆదేశం
పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతినెలా సీఎస్‌డీటీలు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలు మరింతగా చేసేలా ఆదేశాలు ఇచ్చాం. – జి.మురళీనాథ్,
జిల్లా పౌరసరఫరాల అఽధికారి
చంద్రబాబు ప్రభుత్వ పాలనలో పేదల బియ్యం పక్కదారి..
నామమాత్రంగా అధికారుల తనిఖీలు!
రేషన్ దుకాణాల నుంచి నేరుగా
తరలిపోతున్న బియ్యం
సరిహద్దులు దాటించేస్తున్న బియ్యం వ్యాపారులు
11నెలల్లో 77 కేసుల నమోదు
729.91 క్వింటాళ్లు స్వాధీనం
11 నెలల్లో 77 కేసుల నమోదు
11 నెలల్లో 77 కేసుల నమోదు


