మెరికల్లా తయారుకావాలి
విజయనగరం క్రైమ్: పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో మెరికల్లా తయారుకావాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మహిళా పోలీస్ అభ్యర్థులకు పిలుపునిచ్చారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 478 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణను సోమవారం గంట కొట్టి సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల పాత్ర కీలకమన్నారు. శిక్షణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరాజుకు సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు, డీఎస్పీలు పి.శ్రీకాంత్, ఎమ్.మహేష్, టి.రమేష్, మెడికల్ ఆఫీసర్ ఉదయ కుమార్, ఏఓ టి.భవాని, సీఐ మంగవేణి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


