దుర్మార్గం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాలాంటి పేదవిద్యార్థుల కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకొస్తే... నేటి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంది. ఇది దుర్మార్గం. పేదలు, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సరికాదు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి.
– మీసాల శ్రీను, ముచ్చర్ల గ్రామం,
గజపతినగరం మండలం
ప్రజల ఆరోగ్యంతో ఆటలా..?
ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరిస్తే పేదలకు ఉచిత వైద్యం అందదు. విద్యార్థులకు వైద్యవిద్య దూరం అవుతుంది. ప్రజల ఆరోగ్యం, పేద కుటుంబాల విద్యార్థుల చదువులతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన పోరుబాటకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. – బోడసింగి రఘు,
బొడసింగిపేట గ్రామం, బొండపల్లి మండలం
దుర్మార్గం


