బానిసలవుతున్నారు..!
కౌన్సెలింగ్ చేస్తున్నాం..
మద్యం ప్రియులు
●గంట్యాడ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఏడాదిన్నర కాలంగా గ్రామంలో దొరికే బెల్టు షాపు దగ్గర విచ్చలవిడిగా మద్యం సేవించడంతో తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో అతని
కుటుంబం ఆర్థికంగా కుదేలైంది.
కుటుంబ పోషణ కష్టంగా మారింది.
●విజయనగరం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఏడాది కాలంగా మద్యానికి బానిసయ్యాడు. అనారోగ్యం పాలయ్యాడు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. కుటుంబ పోషణే భారంగా మారింది. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరో వైపు తీవ్ర అనారోగ్య సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు.
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో మద్యానికి బానిసలైన వారు కుటుంబ పోషణ కష్టంగా మారి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో మద్యం ఏరులై పారుతుంది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ షాపులు ఏర్పాటు చేసి మరీ తాగిస్తున్నారు. దీనికి తోడు ప్రతీ పల్లెలోనూ సందుకొకటి చొప్పన పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు వెలిశాయి. దీంతో ఏటీఎం మాదిరి 24 గంటల పాటు గ్రామాల్లో మద్యం దొరుకుతుంది. తెల్లవారుజామున 5 గంటల నుంచే మందుబాబులు తాగడం మొదలు పెడుతున్నారు. ఓ వైపు చంద్రబాబు సర్కార్ బెల్టు షాపులు పెడితే తోలు తీస్తాం.. అని గొప్పలు చెబతుతుంది. కానీ అది ప్రకటనలకే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం ఏటీఎం మాదిరి దొరుకుతుండడంతో మందుబాబులు ఒళ్లు, పళ్లు కానకుండా తాగేస్తున్నారు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. డీ అడిక్షన్ సెంటర్ గురించి తెలిసిన మద్యం ప్రియులు దాని బారి నుంచి బయటపడేందుకు అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. తెలియని వారు ఇంటి వద్దే అనారోగ్యంతో కృంగిపోతున్నారు. తీవ్ర అనారోగ్యం బారి న పడిన వారిలో కొంతమంది మృత్యువాత పడుతున్నారు. అంతేకాకుండా 70 ఏళ్లు, 80 ఏళ్లు బతకాల్సిన వారు మద్యం అధికంగా సేవించడం వల్ల 40, 50 ఏళ్లుకే మృత్యువాత పడుతున్నారు.
తొమ్మిది నెలల్లో
1329 కేసులు నమోదు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో డీ అడిక్షన్ సెంటర్ ఉంది. ఇక్కడ మద్యానికి బానిసై న వారికి చికిత్స అందిస్తారు. ఈ అడిక్షన్ సెంటర్‌లో 2025 జనవరి నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు 1329 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ వరకు వచ్చే వారికి ముందుగా మద్యం సేవించడం వల్ల కల్గే అనర్ధాలు, అనారోగ్య సమస్యలు గురించి కౌన్సెలింగ్ ఇస్తారు. అదేవిధంగా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స కూడా అందిస్తారు. మద్యం మాన్పించడానికి అవస రమైన కౌన్సెలింగ్, చికిత్సతో పాటు అతనికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా చికిత్స అందిస్తారు.
కాలేయం, కిడ్నీ సమస్యల బారిన మద్యం ప్రియులు
మద్యం అతిగా సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కాలేయం, పక్షవాతం, కిడ్నీ, నరాల సంబంధిత వ్యాధు ల బారిన పడుతున్నారు. కొంతమందికైతే కాలే యం పూర్తిగా దెబ్బతిన్న వరకు ఆస్పత్రికి రావడం లేదు. మద్యం అతిగా సేవించడం వల్ల చాలా మంది పక్షవాతం బారిన కూడా పడుతున్నారు.
డ్రగ్ డీ అడిక్షన్ కేంద్రానికి వచ్చే రోగులకు వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. కుటుంబ సభ్యులతో కలిసి కూడా కౌన్సెలింగ్ చేస్తున్నాం. అవసరమైన మందులు, చికిత్స అందిస్తున్నాం. రెగ్యులర్‌గా ఫాలోఅప్ చేస్తున్నాం.
– డాక్టర్ శారద, మానసిక విభాగం హెచ్‌వోడీ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
బానిసలవుతున్నారు..!
బానిసలవుతున్నారు..!


