గ్రామీణ తపాలా ఉద్యోగుల అభ్యున్నతికి కృషి
● రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య
విజయనగరం టౌన్: గ్రామీణ తపాలా ఉద్యో గుల అభ్యున్నతికి కృషి చేయాలని ఆల్ ఇండి యా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్ పిలుపునిచ్చారు. స్థానిక జెడ్పీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదివారం డివిజన్ స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ తపాలా ఉద్యోగులను డిపార్ట్‌మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల తో సమానంగా అలవెన్సులన్నీ ఇవ్వాలని, గ్రా ట్యుటీ, సేవరెన్స్ అమౌంట్ రూ.20 లక్షలు ఇవ్వాలని, మినిమమ్ పెన్షన్ రూ.పది వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తపాలా ఉద్యోగు ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణపతి మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 75వేల మంది ఉన్న గ్రామీణ తపాలా ఉద్యోగులను ఎనిమిదవ వేతన కమిటీ పరిధిలోకి తీసుకుని డిపార్ట్‌మెంట్ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘ నేత నందికేశ్వరరావు మాట్లాడుతూ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్లు టార్గెట్‌ల విషయమై చాలా ఇబ్బందులు పడుతున్నారని, నెట్‌వర్క్ సమస్యలు ఫేషియల్ అటెండెన్స్‌పై పునరాలోచన చేయాలని, చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్‌కి సమస్యలను వివరించాలని రాష్ట్ర కార్యదర్శికి తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అధ్యక్షులుగా పి.చిన్నంనాయు డు, కార్యదర్శిగా టి.ఉపేంద్ర,కోశాధికారి ఎం. అప్పలనారాయణను ఎంపిక చేశారు. యూనియన్ నాయకులు రామానందం, శ్రీనివాసరా వు, ఈశ్వరరావు, హేమలత, సురేంద్ర, పెంట పాపయ్య, గణపతి, మర్రెడ్డి, ప్రసాద్, శంకర్‌నాయుడు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


