ఎస్‌టీయూ జిల్లా నూతన కార్యవర్గం
విజయనగరం అర్బన్: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ప్రభు త్వ సంస్కృతి పాఠశాల ప్రాంగణంలో ఆదివారం జరిగిన సంఘం 79వ వార్షిక జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఎన్నుకున్న కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడుగా వై.అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా డి.శ్యామ్, ఉపాధ్యక్షులుగా డి.శ్రీరాములు, ఎస్.నారాయణరావు, అదనపు ప్రధాన కార్యదర్శి గా ఆర్.ఎస్.ఉమామహేశ్వరరావు, ఆర్థిక కార్యదర్శిగా ఎస్.శ్రీనివాస్‌దొర, కార్యదర్శులుగా ఈ.అప్పలనాయుడు, జి.నారాయణరావు, వి.సౌథమిని, పి. ఆదిలక్ష్మి, ఎల్.వసుంధర, వైఎం.అన్నపూర్ణ, ఆర్థిక కమిటీ సభ్యులుగా బి.శ్రీను, డీఎస్.బాలాజీ, రాష్ట్ర కౌన్సిలర్ వి.గోవిందరావు, సీపీఎస్ కన్వీనర్‌గా సీ ఎస్‌వీ నాయుడు ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకుడిగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీ రమణ వ్యవహరించారు. ఎన్నిక అనంతరంప్రతిజ్ఞ చేశారు.


