
ఎల్లిపోతా.. నేనెల్ల్ల్లిపోతా..!
సాక్షిప్రతినిధి, విజయనగరం:
ఆయన జిల్లాకే పెద్దతల.. అన్ని శాఖలను పర్యవేక్షించడం.. అవసరాన్ని బట్టి శిక్షించడం.. సమన్వయం చేయడం.. ఒకటేమిటి.. జిల్లా మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఉంటుంది. ఆయన పచ్చపెన్ను మూత తీస్తే ఎవరికో మూడినట్లే.. ఎవరైనా ఆయన ముందు గజగజే.. కానీ రోజులు బాలేవు. ఆయన ఇక్కడి పరిస్థితులు చూసి.. ఎల్లిపోతా.. నేనెల్లి పోతా.. నన్నాపకండి అంటూ ప్రభుత్వ పెద్దల వద్ద ఆవేదన చెందుతున్నారు. అరెరే.. ఎంతోమంది ఆఫీసర్లు ఆ పోస్టు కోసం కలలుగంటారు. సాధ్యమైనన్ని ఎక్కువరోజులు ఆ పోస్టులో ఉండాలని కోరుకుంటారు.. మరి మీరేంటి ఇలా.. కనీసం రెండేళ్లయినా ఉండండి బాబా.. అని పెద్దాఫీసర్లు నచ్చజెబుతున్నా.. ఉండనుగాక ఉండను.. ఇంకా నన్నక్కడ ఉంచితే మీమీద ఒట్టు అని చెప్పి వచ్చేశారు. దీంతో ఇదెక్కడి గోల రాజా అనుకుంటూ సర్లే.. ఏదో చేద్దాం.. జస్ట్ కొన్నాళ్లు ఓపిక పట్టండి అని నచ్చజెప్పి పంపేశారట.
గతంలో పనిచేసిన జిల్లా అధికారులు.. నాయకులు.. ఉద్యోగులు కాస్త పరిచయస్తులు కాబట్టి ఉద్యోగం సులువవుతుందని వచ్చిన జిల్లా పెద్దాయన మొదట్లో అనివార్యంగా అధికార పక్షానికి అనుకూలంగా పని చేశారు. దీంతో బదిలీలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. కొన్నికొన్ని రెవెన్యూ ఫైళ్లు చకచకా పరుగులు తీశాయి. ఎమ్మెల్యేలు.. ఇంకా పైనున్న పెద్దలు కూడా కూల్.. ఫీల్ గుడ్... రోజులు గడిచేకొద్దీ పెద్దాయన పెద్దరికం బ్యాటరీ చార్జింగ్ మాదిరి తగ్గిపోతుండగా ఇటు ఎమ్మెల్యేల పెత్తనం ఆంజనేయుడి తోకలా పెరిగిపోతోంది.
బలం పుంజుకున్న టీడీపీ నేతలు ఇక పెద్దాయన మీద పెద్దరికం చూపడం మొదలెట్టారు. అదే జోరులో బలవంతాన ఉన్నఫళంగా మూడే రోజుల్లో పాత ఎంఆర్ ఆస్పత్రి జాగాలో ఉన్న రైతు బజారును ఖాళీ చేయించారు. ఇంకా ఇలాంటి పలు పనులు లైన్లో పెట్టి ఇవన్నీ.. ఈ ఫైళ్లన్నీ మనవే.. చకచకా చేసేయాలి. గవర్నమెంట్ మనదే.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ జులుం చూపడం మొదలెట్టారు. ఆఖరుకు నియోజకవర్గ సరిహద్దులు.. వార్డుల బోర్డర్లు సైతం తెలియని వాళ్లు డిక్టేట్ చేయడం మొదలెట్టడంతో పెద్దాయనకు అనుమానం మొదలైంది. ఇంతకూ నేను పెద్దా.. వాళ్లు పెద్దా అనే సందేహంతో ఇక అన్ని ఫైళ్లపై ఇష్టానుసారంగా సంతకాలు గీకేయడం కుదరదని చెప్పేశారు. దీంతో ఎమ్మెల్యేలకు చిరాకు మొదలైంది. జిల్లాలో రాజకీయం మొదలెట్టారట.
ఆయన్ను మార్చాలంటూ మంత్రి, ఎమ్మెల్యే వెళ్లి ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు.. ఈ విషయం ఈయనకు తెలిసిపోయింది. ఇన్నాళ్లు వాడుకుని.. ఇప్పుడు నా మీదనే ఫిర్యాదు చేస్తారా అనే ఆగ్రహంతో వారికి తన చాంబర్లోకి ఎంట్రీ లేకుండా చేశారు. ఇక అప్పట్నుంచి వాళ్లు అసలు రాజకీయం మొదలు పెట్టారు.. దుష్ప్రచారం మొదలైంది.
సీన్ కట్ చేస్తే...