పాఠాలు చెప్పని సిబ్బందికి ఉపాధ్యాయ పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

పాఠాలు చెప్పని సిబ్బందికి ఉపాధ్యాయ పురస్కారాలు

Sep 5 2025 5:50 AM | Updated on Sep 5 2025 5:50 AM

పాఠాల

పాఠాలు చెప్పని సిబ్బందికి ఉపాధ్యాయ పురస్కారాలు

నేడు కలెక్టరేట్‌లో గురుపూజోత్సవం

అవార్డుల ఎంపిక విధానాన్ని

తప్పుబడుతున్న ఉపాధ్యాయ సంఘాలు

కౌన్సెలింగ్‌లో అందించిన సేవలకు గుర్తించి..

పురస్కారాల జాబితాలో డీఈఓ కార్యాలయం సిబ్బందికి చేర్పడంపై ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నాం. ఉపాధ్యాయులుగానే ఉద్యోగంలో చేరిన వారి సేవలను డీఈఓ కార్యాలయంలోని వివిధ కౌన్సెలింగ్‌ ప్రక్రియ విధులు నిర్వహిస్తుంటారు. ఇటీవల నిర్వహించిన బదిలీ కౌన్సెలింగ్‌లో వారు చూపిన ప్రతిభను గుర్తించి స్వాతంత్య్ర దినోత్సవ పురస్కారాలు లభిస్తాయని అనుకున్నాం. అప్పుడు ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఇస్తున్నాం.

– యూ.మాణిక్యంనాయుడు, డీఈఓ

విజయనగరం అర్బన్‌: ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే గురువుకు ఎల్లప్పుడూ సమాజంలో ఉన్నత స్థానం ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఏటా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే.. ఈ ఏడాది అవార్డులకు గురువుల ఎంపిక విమర్శలకు దారితీస్తోంది. జిల్లా స్థాయిలో 76 మందిని అవార్డులకు ఎంపిక చేశారు. వీరిలో పాఠాలు చెప్పని, తరగతులకు సంబంధంలేని డీఈఓ కార్యాలయ సిబ్బందిని ఎంపిక చేయడాన్ని ఉపాధ్యాయ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. రాష్ట్రస్థాయి అవార్డులు ముగ్గురికి ప్రకటించినా వాటిలో ఎస్‌జీటీ కేటగిరీకి లేకపోవడంపై ఆ వర్గం భగ్గుమంటోంది. ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించేందుకు 25 అంశాలతో కూడిన ప్రమాణాలపై 100 మార్కులు నిర్దేశిస్తారు. కనీసం 35 మార్కులు వచ్చిన వారిని ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. వచ్చిన దరఖాస్తుదారుల పోటీను బట్టి ఆ మార్కుల కట్టాఫ్‌ ఉంటుంది. ఈ ఏడాది జిల్లా స్థాయి అవార్డులకు దరఖాస్తు చేసిన దాదాపు 100 మందిలో 76 మందిని ఎంపిక చేశారు. కూటమి నాయకుల సిఫార్సుల మేరకు గురువేతరులను అవార్డులకు ఎంపిక చేయడం నిజమైన గురువులను అవమానపరచడమేనని విమర్శిస్తున్నాయి.

జిల్లా కలెక్టరేట్‌ ఆడిటోరియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గురుపూజోత్సవం నిర్వహిస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, 76 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తామన్నారు.

అవార్డుల ఎంపిక అశాసీ్త్రయం

పురస్కారాల ఎంపిక విధానం అశాసీ్త్రయంగా ఉండడం వల్ల అనర్హులకు లభించే పరిస్థితి వచ్చింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధానానికి స్వస్థిపలకాలి. ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించి అవార్డులకు ఎంపిక చేసే అధికార యంత్రాంగం జిల్లా స్థాయిలో ఉండాలి. ప్రతిభ ఉన్న వారు చాలామంది దరఖాస్తు చేసుకోవడం లేదు. అలాంటి వారందరినీ గుర్తించే అవ కాశం ఈ విధానంలో లభిస్తుంది. అవార్డుల కోసం అర్హుల ఎంపిక ఏ ప్రాతిపదికన చేపట్టారో ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ తెలియజేయాలి. – డి.శ్యామ్‌, రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీయూ

పాఠాలు చెప్పని సిబ్బందికి ఉపాధ్యాయ పురస్కారాలు 1
1/2

పాఠాలు చెప్పని సిబ్బందికి ఉపాధ్యాయ పురస్కారాలు

పాఠాలు చెప్పని సిబ్బందికి ఉపాధ్యాయ పురస్కారాలు 2
2/2

పాఠాలు చెప్పని సిబ్బందికి ఉపాధ్యాయ పురస్కారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement