
‘సూపర్ స్కూల్’గా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల
లక్కవరపుకోట: మండలంలోని జమ్మాదేవిపేట గ్రామం సమీపంలో గల మహాత్మా జోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలల్లో రాష్ట్రస్థాయిలో సూపర్ స్కూల్ కేటగిరి–ఎలో ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ పాత్రో గురువారం తెలిపారు.ఈ మేరకు 3వ తేదీన విజయవాడలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల కార్యదర్శి మాధవీలత చేతుల మీదుగా ఈ ప్రశంసాపత్రాన్ని అందుకున్నట్లు చెప్పారు. 10వ తరగతి పరీక్షా పలితాల్లో శతశాతం ఉతీర్ణత,ఈ ఏడాది పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థినులు ట్రిపుల్ ఐటీకీ ఎంపిక కావడం, పాఠశాలలో గ్రంథాలయం నిర్వహణ, పర్యావరణ హిత ప్రాజెక్టులు తదితర అంశాల్లో మిగిలిన బీసీ గురుకుల విద్యాలయ సంస్థలకు భిన్నంగా నిర్వహించడం వల్ల ఈ గుర్తింపు లభించిందన్నారు. ఈ సందర్భంగా ఈ ఘనత సాధనకు కృషిచేసిన బోధనా సిబ్బందిని ప్రిన్సిపాల్ అభినందించారు.