
డీఏ బకాయిలు తక్షణమే చెల్లించాలి
● ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె
నెల్లిమర్ల: పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లిమర్లలోని రామతీర్థం కూడలిలో ఉన్న ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించారు. ఉపాధ్యాయ సిబ్బందికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 12వ పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించాలని, ఇప్పటి వరకు ఉన్న ఐఆర్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు, ఈఎల్‌ఎస్, సీపీఎస్, ఉద్యోగులు, ఉపాధ్యాయుల డీఏ బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షుడు కె.ఎస్.జె.మోహన్, పీఆర్టీయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నరసింగరావు, వి.శ్రీనివాసరావు, జి.శ్రీధర్‌నాయుడు, ఎ.జగన్నాథరావు, ఎస్.రజిని, ఎ.గీతాంజలి, ఎం.శ్రీదేవి, సీహెచ్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.