లక్కవరపుకోట: మండలంలోని కళ్లేపల్లి సచివాలయానికి బుధవారం రాత్రి 150 బస్తాల యూరియా వ చ్చింది. ఈ యూరియాను రేగ, కళ్లేపల్లి, పూడివానిపాలెం, సీతాగొర్లెవానిపాలెం, శ్రీరాంపురం, తామరాపల్లి గ్రామాలకు చెందిన రైతులకు అందజేస్తామని వ్యవసాయాధికారులు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తు న రైతులు గురువారం ఉదయం 9 గంటలకే సచివా లయం ముందు క్యూ కట్టారు. ఇంతలో కూటమి నా యకులు సచివాలయం వద్దకు చేరుకుని వారికి నచ్చి న వారికి యూరియాను అందజేశారు. దీంతో ఉద యం నుంచి లైన్‌లో నిల్చున్న రైతులకు యూరియా దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని వాపోయారు. రైతులను ఉసురు పెట్టిన ప్రభుత్వాలు ఎంతకాలం పాలన చేయలేవంటూ రైతులు శాపనార్థాలు పెట్టారు.