
ప్రభుత్వం బుద్ధి మారేలా చూడవయ్యా..
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అంటే నమ్మేశాం. అదంతా గ్యాస్ సిలిండర్లు కాదు.. గ్యాస్ అని మెల్లగా అర్థమైంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే మా మహిళలకు మూడు నామాలు పెట్టేశాడు. ఏడాదికి మూడు ఉచితంగా గ్యాస్ సిలెండర్‌లు ఇస్తామని చెప్పి కేవలం ఒక్కటంటే ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అవి కూడా కొంతమందికే వచ్చాయట. మిగిలిన వారు మాకు ఎప్పుడు సబ్సిడీ డబ్బులు పడాతాయేనని కళ్లు కాయాలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సులు వేయిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ఆర్టీసీలో ఉన్న 20 రకాల సర్వీసుల్లో కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే వచ్చి పోవాలని చెప్పకనే చెప్పేశారు. ఆ బస్సుల్లో సీట్లు కోసం మాలో మేమే తన్నులాడుకునే దుస్థితికి దిగజార్చారు. ఇక మేం బతకడమే కష్టంగా ఉంది.. ఇక ఇంకేం పండగ చేస్తాం స్వామీ..!
అందరి కష్టాలు తీర్చే నీ పండగ టైముకు జనాలకు కష్టాలు తెచ్చిపెట్టింది ఈ ప్రభుత్వం.. ఏం చేద్దాం వచ్చే ఏడాదికై నా ఈ ప్రభుత్వం బుద్ధి మారేలా చూడవయ్యా.. అప్పటికై నా మా కష్టాలు తీరి.. అన్నీ అనుకున్నట్లు జరిగితే నీకు కొబ్బరి బిళ్లకు బదులుగా ఒరిజినల్ లడ్డూ పెడతాను.. అయినా అదేంటి గణపతీ గతంలో మా ఊళ్లో ఎక్కడా బెల్ట్ షాపే ఉండేది కాదు.. ఈ సారి చూస్తే వీధికొకటి చొప్పున మొత్తం ఐదు బెల్ట్ షాపులున్నాయి. కుర్రోళ్లంతా పొద్దల్లా తాగి తందానాలు ఆడతన్నారు. సాయంత్రం వీధిలోకి వెళదామంటే భయంగా ఉంది. ఈ గణపతి నవరాత్రులు ఎంతలా తాగి ఊగుతారో చూస్తేనే భయంగా ఉంది స్వామి. ఏమో నీ పండగ .. నీ ఇష్టం.. ఎలా చేసుకుంటావో. ఎలా చేయించుకుంటావో నీ దయ... ఉంటాను మరి. .. చల్లగా బతికుంటే వచ్చే ఏడాది కలుద్దాం..!
మహిళలకు
మూడు నామాలు పెట్టిన చంద్రాలు సార్....

ప్రభుత్వం బుద్ధి మారేలా చూడవయ్యా..