
గిరిజనుల చెంతన విద్యా దీపం
దత్తిరాజేరు: కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయనికి 2023 ఆగస్టు 25వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసిన చోటే శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి, గిరిజనుల జీవితాల్లో కాంతులు నింపాలంటే ఈ విద్యాదీపం నిబంధనల ప్రకారం వారి చెంతనే ఉండాలన్న కృత నిశ్చయంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేశారు. ప్రస్తుతం విజయనగరం శివారు గాజులరేగ వద్ద ఏయూ స్టడీ సెంటర్లో తాత్కాలికకంగా కొనసాగుతోంది, ఈ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థను ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన సాలూరు పరిధిలోని మెంటాడ మండలం, గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలాల మధ్యలో చినచామలాపల్లి, మర్రివలస రెవెన్యూలో 561.88 ఎకరాల విస్దీర్ణంలో సువిశాలమైన ప్రకృతి రమణీయతతో చక్కని ప్రాంతంలో విద్యా సౌరభాలు విరబూయనున్నాయని ఈ ప్రాంత ప్రజలు, విద్యావేత్తలు ఆనందోత్సాహంలో ఉన్నారు. 120 అడుగుల వెడల్పు రోడ్డు పనులతో పాటు తరగతి భవనాలు(అకడమిక్ బ్లాక్) పరిపాలన భవనం(అడ్మిన్ బిల్డింగ్) బాలికలు, బాలురు వసతి గృహాలు రానున్న విద్యా సంవత్సరానికి పూర్తి చేయడానికి కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండడంతో పనులు చక చకా జరుగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు.
పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పన కోసం
కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో తాగునీరు ఇతరత్రా నీటి అవసరాలను తీర్చేందుకు రూ.7 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పనులు గత వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రారంభమై పూర్తయ్యాయి. అలాగే పైప్‌లైన్ పనులు కూడా కొలిక్కి వస్తున్నాయి, మౌలిక వసతుల కల్పనకు నిధులు, రైతుల నుంచి సేకరించిన భుములకు పరిహారం చెల్లింపునకు గత ప్రభుత్వం హయాంలోనే రూ.61.06 కోట్లు మంజూరై పంపిణీ కూడా జరిగింది. రూ.16 కోట్లు అప్రోచ్ రోడ్డుకు డ్రైయిన్లు, అలాగే విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం మరో రూ.48.61 లక్షలు కేటాయించింది. అప్పటికే ఆ భూముల్లో ఉన్న 220 కేవీ విద్యుత్ టవర్లు తొలగించడానికి రూ.12.43 లక్షలు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి,
ఫలిస్తున్న నాయకుల కృషి
ఉత్తరాంద్రకు పెద్ద దిక్కయిన రాష్ట శాసన మండలి ప్రతిపక్ష నేత, అప్పటి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకబడిన ప్రాంతంలో గిరిజన నియోజక వర్గానికి విద్యా కుసుమం లాంటి వర్సిటీ రావాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని గిరిజన శాఖ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడక రాజన్నదొరతో కలిసి ఒప్పించడంతో నేడు ఉమ్మడి జిల్లా విజయనగరంలో వర్సిటీ నిర్మాణం జరగడం శుభపరిణామమని పులువురు ప్రశంసిస్తున్నారు. వర్సిటీ ముఖద్వారం గజపతినగరం నియోజకవర్గం వైపు రావడంతో జాతీయ రహదారి మీదుగా రాక పోకలు సాగడానికి అప్పటి గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య చేసిన కృషిని నియోజకవర్గ, జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. యూనివర్సిటీకి వైజాగ్. భోగాపురం ఎయిర్ పోర్టులు దగ్గరగా ఉండడం, కోమటిపల్లి, బొబ్బిలి రైల్వే స్టేషన్లు కూడా దగ్గరలో ఉండడంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విద్యను అభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం చాలా దగ్గరగా ఉండడం గమనార్హం.
నెరవేరనున్న జగనన్న ఆశయం
కేంద్రియ విశ్వ విద్యాలయానికి సొంత క్యాంపస్
రూ.834 కోట్లతో సువిశాల
ప్రాంగణంలో భవన నిర్మాణం
ఇప్పటికే సిద్ధమవుతున్న అడ్మిన్, అకడమిక్ బ్లాక్ బిల్డింగ్‌లు
వచ్చే విద్యా సంవత్సరానికి
అంతా సిద్ధం

గిరిజనుల చెంతన విద్యా దీపం