
వినేవారే లేరా?
ఇబ్బందులు పడుతున్నాం
వేతనాలు పెంచాలి
వీఆర్‌ఏల గోడు..
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తోంది... వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి కనీసం చొరవ చూపడంలేదు. వినతులు అందజేసినా ఫలితం లేదు. నెలకు ఇచ్చిన రూ.11వేల వేతనంతో కుటుంబాన్ని పోషించేందుక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పదోన్నతుల కల్పనలో కూటమి కినుక వహిస్తోంది. వాచ్‌మన్ ఉద్యోగం సైతం చేయిస్తోంది. ఖాళీలను భర్తీ చేయకుండా పనిభారం మోపుతోంది. వీఆర్‌ఏల గోడు వినేవారే లేరు. అందుకే శనివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు వీఆర్‌ఏల సంఘం నాయకులు తెలిపారు. సెప్టెంబరు 2న జిల్లా కేంద్రలో నిరసన తెలియజేస్తామన్నారు.
వీఆర్‌ఏల సమస్యలపై దృష్టి సారించని కూటమి
నిబంధనలకు విరుద్ధంగా వాచ్‌మన్ విధులు
చాలీచాలని వేలతనాలతో ఆర్థిక ఇబ్బందులు
జిల్లాలో 338 మంది వీఆర్‌ఏలు
సమస్యలు పరిష్కరంచాలంటూ నేటి నుంచి పోరుబాట
నైట్ వాచ్‌మన్‌లుగా మహిళా వీఆర్‌ఏలను విధులకు పంపడం సరికాదు. తక్షణమే అటెండర్, నైట్ వాచ్‌మన్ పోస్టులు భర్తీ చేయాలి. మా సమస్యలపై ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నా అధికారులు, పాలకులు స్పందించడం లేదు. తక్షణమే ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించాలి. – జి.కృష్ణారావు,
వీఆర్‌ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
వీఆర్‌ఏలు అంతా చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం. ఖాళీలు భర్తీచేయక పోవండంతో సిబ్బందిపై పని భారం పెరుగుతోంది. ప్రభు త్వం మా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదు. ఎన్నోసార్లు సమస్యల పరిష్కారానికి వినతులు, నిరసనలు తెలిపినా కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మా సమస్యలకు పరిష్కారం చూపాలి.
– జి సరోజ, వీఆర్‌ఏ

వినేవారే లేరా?

వినేవారే లేరా?