
విద్యాసంస్కరణల అమలుతో వికసిత్ భారత్
● ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ సంయుక్త
వ్యవస్థాపక కార్యదర్శి జి.లక్ష్మీస్
విజయనగరం అర్బన్: నవ భారత్ నిర్మాణానికి జాతీయ విద్యా విధానం–2020 సంస్కరణల అమలు కీలకమని అఖిల భారత రాష్ట్రీయ శిక్షక్ మహాసంఘ్ (ఏబీఆర్‌ఎస్‌ఎం) జాతీయ సంయుక్త వ్యవస్థాపక కార్యదర్శి గుంథ లక్ష్మీస్ అన్నారు. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ‘హమారా సంవిధాన్–హమారా స్వాభిమాన్– వికసిత్ భారత్ కోసం జాతీయ విద్యావిధానం–2020 ఆత్మలా ఉంది’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, సాంస్కృతిక గౌరవం, విద్యా సంస్కరణలు వంటి చర్యల అమలు వికసిత్ భారత్ నిర్మాణానికి కీలకమన్నారు. వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ మాట్లాడుతూ నూతన విద్యావిధానం అమలుతో విద్యా నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. అనంతరం ముఖ్య అతిథిని సత్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ ఏబీఆర్‌ఎస్‌ఎం అధ్యక్షురాలు డాక్టర్ పరికిపాండ్ల శ్రీదేవి, వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, వివిధ విభాగాల అధ్యాపకులు ప్రేమాచటర్జీ, బి.కోటయ్య, కె.సురేష్‌బాబు, బి.వెంకటేశ్వర్లు, ఎం.గంగునాయుడు, పి.కిశోర్ తదితరులు పాల్గొన్నారు.