
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డిమాండ్
● ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్
వంగర: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ శాఖ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్‌మోహన్ డిమాండ్ చేశారు. ఎం.సీతారాంపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆయన విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. విద్యారంగంలో మూల్యాంకనం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసెస్‌మెంట్ విధానంతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడం అన్యాయమన్నారు. తక్షణమే పీఆర్‌సీ కమిషన్ వేయాలని, మధ్యంతర భృతిని చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 కూర్మినాయుడు, ఏటీపీఎఫ్ విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడు లంక రామకృష్ణ, మండల శాఖ అధ్యక్షుడు వై.రామకృష్ణ, చింతాడ అప్పన్నదొర, బుగత ఉమామహేశ్వరరావు, బూరి అచ్చుతరావు, సాయి మురళీ, కె.రవికుమార్, శ్రీకర్, తదితరులు పాల్గొన్నారు.