
పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలి
విజయనగరం క్రైమ్: జిల్లాలో హోంగార్డులుగా పనిచేస్తూ ఇటీవల రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి వెల్లడించిన ఫలితాల్లో కానిస్టేబుల్స్‌గా ఎంపికై న ఆరుగురు హోంగార్డులు శుక్రవారం ఎస్పీ వకుల్‌జిందల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ పోలీస్‌శాఖలో హోంగార్డుగా పనిచేసిన మీరు సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై న తరుణంలో శాఖను ఉన్నతస్థాయిలో తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు. కానిస్టేబుల్‌గా ఎంపికై న మీపై మరింత బాధ్యత పెరిగిందని, శాఖపట్ల అవగాహన, అనుభవంతో కర్తవ్యదీక్షతో పనిచేయాలని హితవు పలికారు. కానిస్టేబుల్‌గా ఎంపికై న హోంగార్డులు నాగరాజు, ఈశ్వరరావు, గౌరినాయుడు, సత్యనారాయణ, దేవి, గౌరినాయుడులు ఎస్పీని అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో హోంగార్డుల ఇన్‌చార్జి ఆర్‌ఐ రమేష్‌కుమార్, హెచ్‌సీలు శ్రీను, రాజు పాల్గొన్నారు.
ఎస్పీ వకుల్ జిందల్