
సాంకేతిక పరిజ్ఞానంతో కేసులు ఛేదించాలి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్: సాంకేతిక పరిజ్ఞానంతో పెండింగ్ కేసుల పరిష్కారం త్వరితగతిన పూర్తిచేయాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నివారణకు సాంకేతికత వినియోగం, కొత్తక్రిమినల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీసు అధికారులు విధుల్లో నిబద్ధత పాటిస్తూ ప్రతి కేసులో న్యాయపరమైన ఆధారాలు బలపరిచి బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం విధుల్లో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అంకితా సురానా, ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి, ఎస్బీ సీఐ రంగనాథం, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, సీపీఎస్ సీఐ అప్పారావు, ఏఆర్‌ఐలు రాంబాబు, నాయుడు, జిల్లాలో ఉన్న సీఐలు, ఎస్సైలు, జీఆర్‌పీ ఎస్సైలు, ఎకై ్సజ్ సీఐలు తదితరులు పాల్గొన్నారు.