
పోర్టల్‌లో నమోదు తప్పనిసరి
పార్వతీపురం టౌన్: జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ నోడల్ ఉపాధ్యాయుల ద్వారా మైజీఓవీ.ఐన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని టీఓఎఫ్‌ఈఐ జిల్లా నోడల్ అధికారి చొక్కాపు శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని జెడ్‌పీహెచ్‌ఎస్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో పొగాకు వాడకం లేని కార్యక్రమాలుగా పోస్టర్ ప్రదర్శనలు, వీధి నాటకాలు, నినాదాల ప్రదర్శనలు, ర్యాలీలు కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. వాటి వీడియోలు, ఫొటోలను వెబ్‌సైట్‌లో ఈ నెల 31 లోపు అప్‌లోడ్ చేయాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు అమలు కావాలని స్పష్టం చేశారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ. 50 వేలు, రూ. 20 వేలు, రూ. 15 వేలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం హేమసుందర్రావు తదితరులు పాల్గొన్నారు.