
దోమల నివారణకు కృషి చేయాలి
విజయనగరం ఫోర్ట్: దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. దోమకుట్టడం ద్వారా మలేరియా వ్యాధి వస్తుందని కనుగొన్న రోనాల్డ్ రాస్ చిత్ర పటానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. ఈ సీజన్‌లో డెంగీ, మలేరియా జ్వరాలు వ్యాప్తిచెందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎల్‌ఓ డాక్టర్ రాణి, డీఎంఓ వై.మణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఆలా హజరత్ ఉత్సవాలు
విజయనగరం టౌన్: జిల్లా వ్యాప్తంగా ఆలా హజరత్ ఉత్సవాలను సున్నీ ముస్లింలు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ఆబాద్‌వీధిలో ఉన్న మదరసా ఆల్ జామియా తుల్ హబీబియా అహ్ మదియా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవ ఊరేగింపును బుధవారం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఇమామ్‌ల ఆధ్యాత్మిక సభలో హఫీజ్‌లు మాట్లాడుతూ ప్రపంచంలో దైవ మహమ్మద్ ప్రవక్త సున్నత్‌లను అధికంగా పాటించిన ఘ నత ఆలా హజరత్‌కు లభించిందన్నారు. ఉత్సవాల్లో అరీఫ్, మహమ్మద్ సలామ్, షేక్ బహు ర్ అరీఫ్, నౌషాద్, మన్నాన్, మసీజీద్ జాఫర్, ఖానా, జానీ, జిల్లాశాఖ ముస్లింల ప్రతినిధి మహమ్మద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు.
సమాజాభివృద్ధికి
ఇంజినీరింగ్ విద్య కీలకం
● జేఎన్‌టీయూ జీవీ రిజిస్ట్రార్
జయసుమ
విజయనగరం అర్బన్: సమాజాభివృద్ధికి ఇంజినీరింగ్ విద్య కీలకంగా నిలుస్తుందని, విద్యార్థులు ఆ దిశగా చదువుకోవాలని జేఎన్‌టీయూ జీవీ రిస్ట్రార్ జి.జయసుమ పిలుపునిచ్చారు. వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థుల కోసం బుధవారం నిర్వహించిన స్టూడెంట్ ఓరియంటేషన్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఇంజినీర్ సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని, విద్యార్థులు ఎల్లప్పుడూ ఉత్తేజంతో ఉండి కొత్తకోర్సుల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు మాట్లాడుతూ ఓరియంటేషన్ కార్యక్రమం ఉద్దేశాన్ని నూతనంగా ప్రవేశించిన ఫస్ట్ ఇయర్ బీటెక్ విద్యార్థులకు, హాజరైన తల్లిదండ్రులకు వివరించారు. కళాశాల పూర్వవిద్యార్థులు సాధించిన ఉద్యోగాలు, వర్సిటీలోని వసతులను తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీజే నాగరాజు, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ వి.ఎన్.వకుల, లైబ్రరీ ఇన్‌చార్జ్ డాక్టర్ సీహెచ్.బిందుమాధురి, ఆఫీస్ ఇన్‌చార్జి డాక్టర్ శివరాం రోలంగి, ప్రొగ్రాం కో ఆర్డినేటర్ అండ్ బేసిక్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎం.సౌభాగ్యలక్ష్మి, ఇతర విభాగాధిపతులు పాల్గొని, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
సర్వమానవాళికి దేవుడు శ్రీకృష్ణుడు
విజయనగరం టౌన్: గురజాడ కళాభారతిలో ప్రబోధసేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ముగింపు ఉత్సవాలకు బుధవారం జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తుల భజనలు, కోలాట ప్రదర్శనలు, చిన్నారుల వేషధారణల నడుమ స్వామివారి విగ్రహాన్ని తిరువీధి జరిపారు. సర్వమానవాళికి భగవంతుడు శ్రీకృష్ణుడని భక్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ ఇఫ్కో డైరెక్టర్ కె.బంగార్రాజు, సమితి ప్రతినిధులు నాయుడు, ప్రసాద్, వంశీ, వెంకి, తదితరులు పాల్గొన్నారు.