
● తెచ్చుకుంటేనే భోజనం...
చిత్రాల్లో ట్రాలీపై భోజనాలు తెచ్చి
దించుతున్నది గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు. కళాశాలలో 333 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి అవసరమైన మధ్యాహ్నభోజనాన్ని కళాశాలకు అర కిలోమీటరు దూరంలో ఉన్న గజపతినగరం ఉన్నత పాఠశాలలో వండుతున్నారు. వంట ఏజెన్సీ ఒక్కటే కావడంతో పాఠశాలలో చదవుతున్న 350 మంది, కళాశాలలో చదువుతున్న 333 మందికి అక్కడే భోజనాలు వండుతున్నారు. కళాశాల విద్యార్థులకు భోజనం కావాలంటే ప్రతిరోజూ ట్రాలీతో వెళ్లి తెచ్చుకుని వడ్డించుకోవాల్సిందే. దీనికోసం ఐదారుగురు విద్యార్థులు తరగతులు మానుకుని శ్రమించాల్సి వస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చదువుకోసం పంపించిన పిల్లలతో పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రకాష్ పట్నాయక్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కళాశాల విద్యార్థులకు కావాల్సిన భోజనాన్ని ట్రాలీ రిక్షాపై తెస్తున్నమాట వాస్తవమేనన్నారు. రిక్షాను కళాశాల తరఫున ఏర్పాటుచేశామని, విద్యార్థులను భోజన నిర్వాహకునికి సాయంగా పంపిస్తున్నామన్నారు. ఎండీఎం నిర్వాహకులు వంట చేస్తున్నారే తప్ప విద్యార్థులకు వడ్డించడంలేదని వాపోయారు. – గజపతినగరం రూరల్

● తెచ్చుకుంటేనే భోజనం...