
జాతీయస్థాయి పోటీలకు క్యాంపస్ చాలెంజ్ విద్యార్థులు
పూసపాటిరేగ: మండలంలోని కోనాడ జంక్షన్‌లో గల క్యాంపస్ చాలెంజ్ విద్యార్థులు జాతీయస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 9న విశాఖలో పారా రాష్ట్రస్థాయి, జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో క్యాంపస్ చాలెంజ్‌కు చెందిన ఓళ్ల రామచరణ్‌తేజ లాంగ్‌జంప్, కొణతాల సోములమ్మ షార్ట్‌పుట్, 100 మీటర్లు, 400 మీటర్లు రన్నింగ్‌లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 29 నుంచి 31 వతేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరగబోయే జాతీయస్థాయి పోటీలలో వారు పాల్గొనున్నారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై న విద్యార్థులను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.దయానంద్, క్యాంపస్ చాలెంజ్ డైరెక్టర్ సత్యనారాయణ శర్మ, ప్రిన్సిపాల్ గాయత్రి, కోచ్ గౌరి అభినందించారు.