విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ

Aug 20 2025 5:07 AM | Updated on Aug 20 2025 5:07 AM

విద్య

విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ

వ్యక్తిగతంగా లేదా..

పాఠశాలల నుంచి

వరీక్షలు రాయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వీవీఎం.ఓఆర్‌జీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవవచ్చు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– జి.లక్ష్మణ రావు, జిల్లా సైస్స్‌ అధికారి

పార్వతీపురంటౌన్‌: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించేందుకు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు, పరిశోధన, ప్రయోగాల్లో రాణించేలా ఏటా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్‌న్‌ మంథన్‌న్‌(వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్షను నిర్వహిస్తోంది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న వారికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌, స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశం ఉంటుంది. అలాగే నెలకు రూ. 2000 వేలు చొప్పున సంవత్స

సృజనాత్మకతను వెలికి తీసేందుకే..

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ చక్కని వేదికగా నిలుస్తుంది. సైన్స్‌ పట్ల అభిరుచిని పెంచడం, వారిని శాస్త్రవేత్తలుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ పరీక్షలో ప్రభుత్వ, ఇతర యాజమాన్య, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చు.

– బి.రాజకుమార్‌,

డీఈఓ, పార్వతీపురం మన్యం

రానికి రూ.24 వేలు స్కాలర్‌షిప్‌ అందుకునే అవకాశం ఉంటుంది.

జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో

పోటీ పరీక్షను జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో నిర్వహిస్తారు. 6 నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం తరగతులకు విడివిడిగా ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లీషు తదితర భారతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారికి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు.

రాష్ట్ర స్థాయికి ఎంపిక ఇలా..

పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారిగా ప్రతిభ చూపిన మొదటి 25 మందిని ఎంపిక చేస్తారు. 6–11 తరగతులకు గాను మొత్తం 150 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. అందులో ప్రతిభ చూపిన ప్రతి తరగతి నుంచి ముగ్గురు వంతున మొత్తం 18 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతి తరగతి నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలతో పాటు మెమెంటో, సర్టిఫికెట్‌ అందజేస్తారు.

దరఖాస్తుల ఆహ్వానం

విద్యార్థి విజ్ఞానన్‌ మంథన్‌ ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్‌న్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆనన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబరు 30వ తేదీలోగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు ముగుస్తుంది. ప్రవేశ పరీక్ష ఆనన్‌్‌ లైన్‌ పద్ధతిలో పాఠశాల స్థాయిలో నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే రోజు విద్యార్థులకు వారికి అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్‌, మొబైల్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌, డిజిటల్‌ పరికరాలతో ఏదైనా ఒక దాని ద్వారా పరీక్షకు నిర్దేశించిన అప్లికేషన్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌న్‌లోడ్‌ చేసుకుని వారి ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశముంది.

విద్యార్థి, విజ్ఞాన్‌ మంఽథన్‌కు

దరఖాస్తుల ఆహ్వానం

సెప్టెంబర్‌ 30 రిజిస్ట్రేషన్లకు

తుదిగడువు

మూడు విడతల్లో పరీక్ష

విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ1
1/2

విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ

విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ2
2/2

విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement