మాజీ సైనికులకు లీగల్‌ సర్వీసెస్‌ క్లినిక్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మాజీ సైనికులకు లీగల్‌ సర్వీసెస్‌ క్లినిక్‌ ప్రారంభం

Aug 20 2025 5:07 AM | Updated on Aug 20 2025 5:07 AM

మాజీ సైనికులకు లీగల్‌ సర్వీసెస్‌ క్లినిక్‌ ప్రారంభం

మాజీ సైనికులకు లీగల్‌ సర్వీసెస్‌ క్లినిక్‌ ప్రారంభం

విజయనగరం లీగల్‌: మాజీ సైనిక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు లీగల్‌ సర్వీసెస్‌ క్లినిక్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి,, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.కృష్ణ ప్రసాద్‌ మంగళవారం ప్రారంభించారు. వీర్‌ పరివార్‌ సహాయత యోజన స్కీమ్‌ 2025ను అనుసరించి ప్రతి జిల్లాలోనూ లీగల్‌ సర్వీసెస్‌ క్లినిక్‌ను ప్రారంభించి మాజీ సైనిక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ సహాయం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ అధికారి కేవీఎస్‌ ప్రసాదరావు, న్యాయవాది ధనుంజయరావు, పారా లీగల్‌ వలంటీర్‌ జి.రమణ, పెద్దసంఖ్యలో మాజీ సైనికోద్యోగులు పాల్గొన్నారు.

29న స్వయం ఉపాధి

శిక్షణకు ఇంటర్వ్యూలు

రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్‌ నైరెడ్‌లో ఈ నెల 29న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్‌ ఎం.రాజేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు అర్హులన్నారు. పురుషులకు సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ అండ్‌ సర్వీసింగ్‌ (30 రోజులు), జెంట్స్‌ టైలరింగ్‌ (31 రోజులు), రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషన్‌ (75 రోజులు), హౌస్‌ వైరింగ్‌ (30 రోజులు), సీసీ టీవీ కెమెరా ఇన్‌స్టాలేషన్‌ (13 రోజులు), ప్లంబింగ్‌ అండ్‌ శానిటరీ వర్క్స్‌ (30 రోజులు), అలాగే సీ్త్రలకు హోం నర్సింగ్‌ (25 రోజులు), లేడీస్‌ టైలరింగ్‌ (31 రోజులు), బ్యూటీ పార్లర్‌ మేనేజ్‌మెంట్‌ (35 రోజులు), కంప్యూటర్‌ డీటీీ ప (45 రోజులు)లో శిక్షణ ఉంటుందని అన్నా రు. ఇంటర్వ్యూకు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డులతో హాజరు కావాలని సూచించారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 9014716255, 9491741129, 9866913371, 9989953145 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

కేజీబీవీ ప్రిన్సిపాల్‌పై

కక్ష సాధింపు సరికాదు

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన

నెల్లిమర్ల రూరల్‌: శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌పై ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రిన్సిపాల్‌ సౌమ్యను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేయడం క్షమించరాని నేరమన్నారు. రాత్రి 10 గంటలు దాటిన వరకు టీడీపీ కార్యాలయంలో సౌమ్యను ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆమెను బదిలీ చేశారని ఆరోపించారు. ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితికి ఆమెను తీసుకువచ్చిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement