
అమృత్ భారత్ పనుల్లో జాప్యం తగదు
పార్వతీపురంటౌన్: అమృత్ భారత్ పనుల్లో జావ్యం తగదని రైల్వే డివిజనల్ మేనేజర్ లలిత్ బోరా అన్నారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అమృత్ భారత్ నూతన స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు కొద్ది రోజుల్లోనే అధునాతన రైల్వేస్టేషన్‌ను అందుబాటులో తీసుకువస్తామన్నారు. అమృత్ భారత్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతనంగా ఎఫ్‌ఓబీ, టికెట్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్, వెయింటిగ్ హాల్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న స్టేషన్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్టేషన్ అభివృద్ధికి సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం కె.సాందీప్, సీనియర్ డీఎన్, ఏడీఎన్ తదితరులు పాల్గొన్నారు.
పనులు పరిశీలించిన రైల్వే డివిజినల్ మేనేజర్