
జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన
పార్వతీపురం టౌన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మంగళవారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంగా స్థానిక బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాయ్ పే చర్చలో అనేక సమస్యల్ని తెలుసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎరువుల కొరత విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు. సుపరి పాలన తొలిఅడుగు కార్యక్రమంలో ప్రభుత్వం తమకు ఆహ్వానించడం లేదన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీ విద్యా సర్వమంగళపీఠంలో దక్షిణామూర్తి భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపు రెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.