
వీరఘట్టంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
● లైసెన్స్ లేని 10 షాపులకు నోటీసులు
వీరఘట్టం: ఇటీవల పలు దుకాణాల్లో నాసిరకమైన చిరుతిళ్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, కాలం చెల్లిన స్నాక్స్ తిని చిన్నారులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని సోమవారం సాక్షి లో ప్రచురితమైన ‘డేంజర్ స్నాక్స్’ కథనంపై జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు స్పందించారు. కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి ఎం.వినోద్‌కుమార్ నాయక్ వీరఘట్టంలోని పలు షాపుల్లో సోమవారం ముమ్మర తనిఖీలు చేశారు. ఓ వైపు జోరు వాన కురుస్తున్నా మరో వైపు షాపుల్లో ఉన్న తినుబండారాల ప్యాకెట్లు పరిశీలించారు.మొత్తం పది షాపుల్లో తనిఖీలు చేయగా అన్ని షాపుల్లో కూడా ఎక్కడా తినుబండారాల ప్యాకెట్లపై తయారీ తేదీ గాని, ఎక్స్‌పైరీ డేట్ గాని లేకపోవడాన్ని గుర్తించారు.ఈ షాపులన్నింటికీ ఆయన నోటీసులు ఇచ్చారు.కాలం చెల్లిన తినుబండారాల ప్యాకెట్లను సీజ్ చేశారు. అయితే ఊరిలోకి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు వచ్చారని తెలియడంతో చాలా షాపులు మూసి వేయడంపై ఆయన షాపుల యజమానుల తీరుపై మండిపడ్డారు.ఆహార పదార్థాలు విక్రయించే ప్రతి షాపు లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.ఇక మీదట ప్రతి వారం వీరఘట్టంలో ఉన్న అన్ని షాపులు తనిఖీ చేస్తానని ఆయన తెలిపారు.వ్యాపారులు సహకరించాలని, నిబంధనలు పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

వీరఘట్టంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

వీరఘట్టంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు