
పాముకాటుతో అస్వస్థత
సీతంపేట: మండలంలోని పాతపనుకువలసకు చెందిన కుండంగి బలరామ్ ఆదివారం రాత్రి పడుకున్న సమయంలో విషసర్పం కాటువేసింది. దీంతో అస్వస్థతకు గురవగా స్థానిక ఏరియా ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు వైద్యులు రిఫర్ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
యువతిని మోసం చేసిన ముద్దాయికి ఏడాది జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: రెండేళ్ల క్రితం ఒక బాలికను నమ్మించి మోసం చేసిన కేసులో ముద్దాయికి విజయనగరం విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి. కె.నాగమణి ఏడాది జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చినట్లు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ గోవిందరావు తెలిపారు. నగరంలోని కొత్తపేటకు చెందిన దశమంతుల లక్ష్మణరావు అనే వ్యక్తి 2023లో ఒక మైనర్‌ను నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి, అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పట్లోనే మహిళా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా ఎస్సై లక్ష్మి కేసు నమోదు చేశారు. ఆ కేసులో అప్పటి డీఎస్పీ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి అభియోగ పత్రాలను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రస్తుత మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ గోవిందరావు సాక్షులను, ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావడంతో స్పెషల్ ఫర్ పోక్సో కోర్టు నాగమణి ముద్దాయి దశమంతుల లక్ష్మణరావుకు పై విధంగా శిక్ష విధించారని డీఎస్పీ తెలిపారు. అయితే ఈకేసులో బాధితురాలికి రూ.20 వేలు పరిహారంగా ఇవ్వాలంటూ కోర్టు తుది తీర్పు ఇచ్చిందన్నారు.